బీజేపీకి నచ్చలేదా ?

BJP

ఈరోజు మంగళవారం ఏపీలో కూటమి గా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ లు తమ ఉమ్మడి మానిఫెస్టోని విడుదల చేసాయి. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిద్ధార్థ్ నాథ్ ఒకే వేదికపై నిలబడి ఈ కూటమి మానిఫెస్టోని విడుదల చేసారు. 

కూటమి హామీలు ఎలా ఉన్నా ఈ కూటమి మేనిఫెస్టో విడుదల కేవలం టీడీపీ-జనసేనకు మధ్య ఒప్పందంతోనే జరిగింది, మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ నాథ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. 

టీడీపీ, జనసేన మానిఫెస్టోని బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ నాథ్ కనీసం పట్టుకోవడానికి నిరాకరించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. టీడీపీ, జనసేన ఉమ్మడి మానిఫెస్టో అన్నట్టుగా బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ నాథ్ వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కూటమి మానిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉందా అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు.   

TCP

janasena