రౌడీ టైటిల్ తో వస్తున్న దేవరకొండ
Vijay Devarakonda as Rowdy Janardhanవిజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యాలనే ఆలోచనతో నిర్మాత దిల్ రాజు కరోనా సమయంలోనే విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నాడు. గీత్ గోవిందం లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పరశురాం విజయ్ దేవరకొండ ని కలిసి ఫ్యామిలీ స్టార్ కథ చెప్పగా విజయ్-పరశురామ్ లు ఆ కథతో దిల్ రాజు ని అప్రోచ్ అయ్యారు. దిల్ రాజు కూడా ఫ్యామిలీ స్టార్ కథ నచ్చి సినిమా చేసారు. కానీ దిల్ రాజు అనుకున్నట్టుగా ఫ్యామిలీ స్టార్ వర్కౌట్ అవ్వలేదు.
ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ బావున్నా కొంతమంది కావాలని నెగెటివ్ చేసి సినిమాని చంపేశారంటూ దిల్ రాజు మోత్తకున్నాడు. అదలా ఉంటే దిల్ రాజు మరోసారి విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి సాఫ్ట్ గా ఫ్యామిలీ స్టోరీ తో కాకుండా మాస్ కథతో విజయ్ సినిమాని ఎనౌన్స్ చేసే ఏర్పాట్లలో దిల్ రాజు ఉన్నట్లుగా టాక్.
విజయ్ దేవరకొండ-దిల్ రాజు కాంబినేషన్ సినిమాకు రౌడీ జనార్ధన్ అనే మాస్ టైటిల్ కూడా పరిశీలనలో వుంది అంటున్నారు. అంటే ఈసారి ఐరెన్ వంచి విలన్ ని చితకబాది మాస్ గా విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ గా దిల్ రాజు బ్యానర్ లో దర్శనమిస్తాడన్నమాట. మరి ఈ కాంబోకి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
VIjay Devarakonda is coming with the title of Rowdy Janardhan







































