ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sequel To Blockbuster RomCom Announced

ప్రేమలు సీక్వెల్ కథ అదేనా?

Sequel To Blockbuster RomCom Announced

మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా మంచి హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రతి భాషలోనూ యూత్ ఆదరించడంతో మేకర్స్ కి లాభాలు కనిపించాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. అయితే సీక్వెల్ లో ఏముంటుంది. ప్రేమలులో రీతూ-సచిన్ ల ప్రేమ చివరి వరకు సుఖంఠం అవ్వదు. సచిన్ వన్ సైడ్ లవ్ మధ్యలో సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో రీతుకి ఆది సతాయింపులు, రీతూ కూల్ కేరెక్టర్ ఇవే అసాంతం కనిపిస్తాయి. 

రీతూ ప్రేమని ఓకె చేసుకుని సచిన్ యుకె వెళ్ళినప్పుడు ప్రేమలు చిత్రాన్ని ఎండ్ చేసారు. సచిన్ ఫ్రెండ్ అమూల్.. రీతూ ఇద్దరూ ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి వచ్చేస్తారు. మరి సీక్వెల్ లో సచిన్ యుకె లో ఉన్నప్పుడు రీతూ ని ఇష్టపడే టీం లీడర్ అది తన ప్రేమని రిజెక్ట్ చేసిన రీతుపై పగతీర్చుకునే కథతో ఏమైనా ప్రేమను సీక్వెల్ ని డిజైన్ చేస్తున్నారా అనే అనుమానాలు రేజ్ అవుతున్నాయి.

అయితే ప్రేమలు చిత్రం థియేటర్స్ లో హిట్ అయినా ఓటీటీ లో అంతగా పెరఫార్మ్ చెయ్యలేదని టాక్ వినిపించింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం సరదాగా సాగినా.. అంత గొప్పగా లేదు అనే మాట ఓటీటీ ఆడియెన్స్ నుంచి వినిపించింది. మరి సీక్వెల్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Get Ready For Premalu 2 In Malayalam

premalu 2