పింక్ శారీ లో మెరిసిన మెగా చిన్న కోడలు

Lavanya Tripathi in pink saree

మెగా చిన్న కోడలు స్థానంలోకి వచ్చిన లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. వరుణ్ తేజ్ తో గత ఏడాది నవంబర్ లో పెళ్లి పీటలెక్కిన లావణ్య త్రిపాఠి మెగా చిన్న కోడలిగా నాగబాబు ఇంట అడుగుపెట్టింది. ఇక పెళ్లి తర్వాత కూడా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేది లేదు అంటూనే తాము నటులమని, అది మా ప్రొఫెషన్ అని నిహారిక వదిన లావణ్యకి వత్తాసు పలికిన విషయం తెలిసిందే.

లావణ్య-వరుణ్ తేజ్ పెళ్ళికి సంబందించిన హల్దీ ఫొటోస్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయిన సమయంలో లావణ్య త్రిపాఠి తన కొత్త లుక్ ని వదిలింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోస్ ని వదులుతూ అభిమానులని సర్ ప్రైజ్ చేసే లావణ్య తాజాగా పింక్ శారీ లో ముద్దు ముద్దుగా కనిపించింది.

లావణ్య అందాలు వర్ణించడానికి మాటల్లేవ్ అన్నట్టుగా లావణ్య కొత్త లుక్ లో కనిపించింది. చక్కటి నవ్వుతో ఆకర్షణగానే కాదు పాజిటివ్ గా కనిపించింది. రీసెంట్ గా అత్తగారు పద్మజ తో కలిసి లావణ్య ఉగాది సెలెబ్రేషన్స్ ని తన ఇంట్లోనే నిర్వహించి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Lavanya Tripathi latest photoshoot goes viral

lavanya tripathi