ఏపీలో జీఎస్టీ వసూళ్లు అదుర్స్

AP

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంలో వీరు అన్న మహాకవి శ్రీశ్రీ వాక్యం నిజమైంది. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావడం లేదు.. ఉత్పత్తి లేదు అంటూ ప్రతిపక్షాలు గద్దల్లా పొడుస్తూ ఉన్నా రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగాలు తరాజువ్వల్లా వినువీధిలో దూసుకుపోతున్నాయి. దీంతో ఈ ప్రగతిని చూసి ప్రతిపక్షాలు నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం చెబుతున్న.. చెప్పుకుంటున్న అంశం కాదు.. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారాం ఈ అంశాన్ని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో అద్భుతమైన వృద్ధి, ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్ళలో 12 శాతం వృద్ధి నమోదైందని కేంద్రం వివరించింది. 

2023 ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య రూ. 5,019 కోట్లు వసూలైనట్లు తేలింది. వాహనరంగం.. సిమెంట్.. బ్యాటరీల పరిశ్రమలు బ్రహ్మాండమైన పురోగతి సాధించడంతో వాటినుంచి భారీ మొత్తంలో జీఎస్టీ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోబాటు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టైర్స్, స్టీల్, ఇతర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటవుతూ వస్తున్నాయి. 

ఉత్పత్తి రంగంలో గణనీయమైన ప్రగతి, శ్రీ సిటీలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల తయారీ ఊపందుకుంది. విశాఖలోని ఫార్మా సిటీలో సైతం పలు పరిశ్రమలు ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో మొత్తంగా చూస్తుంటే పారిశ్రామిక రంగంలో 50. 48 శాతం వృద్ధి నమోదైంది. వ్యవసాయరంగంలో 63.19 శాతం వృద్ధి నమోదైంది. 

రెండేళ్లపాటు కోవిడ్ కారణంగా పలు రంగాలు ఘోరంగా దెబ్బతిన్నా కానీ ఆంధ్రాలో ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషిని దేశానికీ వెల్లడించాయి.

రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా తెలుగుదేశం పాలనలో రూ. 1, 60, 341 ఉండగా ఈ 2023 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2,19, 518కు చేరింది. అంటే ప్రజల తలసరి ఆదాయంలో కూడా భారీ వృద్ధి నమోదైంది. 

ఇలా అన్ని రంగాలూ ప్రగతిపథంలో పయనిస్తుంటే రాష్ట్రం కూడా పురోగతి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు అందని స్థాయిలో పరుగులు తీస్తోంది. దీనికి సీఎం వైయస్ జగన్ గారి దార్శనికత, సమర్థవంతమైన పాలనా.. ముందుచూపు.. ప్రణాళికల అమలు... ఆయా రంగాల ప్రాధామ్యాలు తెలుసుకుని వాటిని ప్రోత్సహించండం వంటి చర్యలే ప్రధానకారణం అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

GST collections in AP

ap
gst