పాపం సమంత.. ‘శాకుంతలం’ డౌటే!
Samantha Shakunthalam In Release Problemsసమంతకు ఆరోగ్య సమస్యలే కాకుండా ఇప్పుడు సినిమా కష్టాలు కూడా చుట్టుముట్టాయి. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం మరోసారి రిలీజ్ ట్రబుల్స్‌ని ఫేస్ చేస్తోంది. గుణశేఖర్ వంటి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరించారు. సహనిర్మాతగా సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు ఉన్నారు. అయినా కూడా ‘శాకుంతలం’ వాయిదాలను కోరుతుండటం.. అందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లుగా తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
బయ్యర్స్ కూడా ఈ సినిమా విషయంలో దర్శకనిర్మాతలకు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి వచ్చారంటే.. ఇక ఈ సినిమా విడుదలయినట్టే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లలేకపోయింది. అందుక్కారణం ట్రైలర్ ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు.. నాసిరకమైన గ్రాఫిక్స్ వర్క్ కూడా ఈ సినిమాపై దృష్టి పడకుండా చేశాయి. దీంతో దిల్ రాజు కూడా ఎక్కడా ఈ సినిమా ప్రస్తావన తీసుకురావడం లేదు. వేసవి కానుకగా ఏప్రియల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని ప్రకటించారు. కానీ ఆ స్థాయిలో ప్రమోషన్స్ మాత్రం ఇంత వరకు స్టార్ట్ చేయలేదు.
అందుక్కారణం మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఫైనల్ రష్ చూసిన గుణశేఖర్ ఇంకా బెటర్‌మెంట్ కోసం.. కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని భావిస్తున్నారట. అలాగే ట్రైలర్ తర్వాత గ్రాఫిక్స్ వర్క్‌పై వచ్చిన స్పందన చూసి ఆయన డిజప్పాయింట్ అయ్యారని, మరింత మెరుగ్గా వాటిని తీర్చిదిద్ది.. మరో ట్రైలర్ వదలాలనే భావనలో గుణశేఖర్ ఉంటే.. బయ్యర్స్ మాత్రం ఈ సినిమా మరోసారి వాయిదా పడితే మాత్రం ఇక మా వల్ల కాదనేలా చేతులెత్తేసేలా మాట్లాడుతున్నారట. దీంతో గుణశేఖర్ అండ్ టీమ్ కంగారు పడుతోంది. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమంత పరిస్థితి ఏంటనేది తెలియాలి. హెల్త్ సహకరించకపోయినా కూడా ఆమె ఈ సినిమా కోసం మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Buyers Warning to Shakunthalam Movie Producers







































