SSMB28 సెకండ్ షెడ్యూల్ పై క్రేజీ న్యూస్

మహేష్ బాబు-త్రివిక్రమ్ ఈ నెలలోనే SSMB28 షూటింగ్ మొదలు పెట్టడం వారం తిరక్కుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసి అప్ డేట్ ఇచ్చెయ్యడంపై చాలామందిలో చాలా అనుమానాలు మొలకెత్తిన విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్ నే యాక్షన్ సన్నివేశాలతో మొదలు పెట్టారు. అయితే కొంతమంది మహేష్ బాబు లుక్ విషయంలో శాటిస్ ఫై అవ్వలేదు అని, కొంతమంది ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసిన త్రివిక్రమ్-మహేష్ సంతృప్తి పడనందునే ఈ షెడ్యూల్ చకచకా ముగించేశారని అన్నారు. ఇక సెకండ్ షెడ్యూల్ కూడా దసరా తర్వాతే మొదలు కాబోతుంది అనే అప్ డేట్ కూడా అప్పుడే ఇచ్చేసారు మేకర్స్.

ఇప్పుడు SSMB28 సెకండ్ షెడ్యూల్ పై క్రేజ్ అప్ డేట్ బయటికి వచ్చింది. అక్టోబర్ 10 నుండి హైదరాబాద్ లోనే SSMB28 సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట త్రివిక్రమ్. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజ హెగ్డే కూడా జాయిన్ అవ్వబోతుందట. మహేష్ బాబు-పూజ హెగ్డే లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారట త్రివిక్రం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ అనుకుంటున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

SSMB28 update

SSMB28 Second Schedule Update
ssmb28
mahesh babu
trivikram
Advertisement
Advertisement