ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nani Shares A Funny Incident Ante Sundaraniki Sets

అమెరికా పోలీస్ లని మోసం చేసిన నాని

Nani Shares A Funny Incident Ante Sundaraniki Sets

శ్యామ్ సింగ రాయ్ హిట్ తర్వాత అంతే ఎనేర్జిటిక్ గా అంతే జోష్ తో నాని అంటే సుందరానికి సినిమాని రేపు శుక్రవారం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే అంటే సుందరానికి సినిమా ప్రమోషన్స్ లో నాని సినిమా సెట్స్ లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ ని పంచుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ దసరా చేస్తున్నారు. ఆ సినిమాలో లుక్ పరంగాను, ఇంకా నటన పరంగాను చాలా కష్టపడాలి. కానీ అంటే సుందరానికి సినిమా ఆడుతూ పాడుతూ చేసేశారా అని అడగగా.. దానికి నాని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. 

అది కూడా అంటే సుందరానికి సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. అప్పట్లో కరోనా పరిస్థితుల వలన అక్కడ షూటింగ్స్ కి అంటే హాలీవుడ్ ఫిలిమ్స్ కి కూడా పర్మిషన్ లేదు. అంటే సుందరానికి న్యూయార్క్ లో షూట్ చెయ్యాల్సి ఉంటే.. పర్మిషన్ రాలేదు. చాలా దొంగపనులన్ని చేసి షూట్ చేసి మ్యానేజ్ చేసాము. పర్మిషన్ లేకుండా న్యూయార్క్ లో ఉంటూ అక్కడ రోడ్స్ మీద షూట్ చెయ్యాలి. ఏమని చేస్తాం.. ఎలా షూట్ చేస్తాం. అటు చూస్తే నలుగురు పోలీస్ లు, ఇటు చూస్తే నాలుగు పోలీస్ లు, పర్మిషన్ లేకపోతే మాములు విషయం కాదు. మనకి టైం లేదు. షూట్ చెయ్యాల్సిందే. అక్కడో మాస్టర్ ప్లాన్ వేసాం అంటూ నాని ఫన్నీగా ఆ విషయాన్ని చెప్పాడు. 

మా అసిస్టెంట్ డైరెక్టర్ ఓ మాస్టర్ ప్లాన్ చేసింది. పర్మిషన్ లేకుండా షూటింగ్ ఎలా చెయ్యాలో చెప్పింది. ఎలా చేస్తుంది అని మేమూ అనుకున్నాం. పోలీస్ లు వచ్చి పర్మిషన్ లేకుండా ఇక్కడేం చేస్తున్నారు అంటే నన్ను చూపించి తనకి పెళ్లి కాబోతుంది. వాళ్ళ వైఫ్ కోసం ఓ సర్ ప్రైజ్ వీడియో షూట్ చేస్తున్నామంటే వాళ్లంతా నా దగ్గరకి వచ్చి ఓ స్వీట్ అంటూ నాకు బెస్ట్ విషెస్ చెప్పి వెళ్లిపోయారు. అంటే నేను షాట్ లో ఉన్నా.. పోలీస్ లు వచ్చి నాకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారేమేమిటి, పర్మిషన్ లేదంటే నాకు ఇలా షేక్ హ్యాండ్ ఇస్తున్నారేమిటి ఎంత కూల్ గా ఉన్నారో.. ఎంత సపోర్ట్ గా ఉన్నారో అనుకుంటే.. అప్పుడు ఆమె వచ్చి మీ పెళ్లి అని చెప్పాను అప్పుడు వాళ్ళు హ్యాపీ అయ్యి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ వెళ్లిపోయారు. సో నాని అండ్ అంటే సుందరానికి టీం అలా అమెరికా పోలీస్ లని మోసం కాదు మ్యానేజ్ చేసి అంటే సుందరానికి షూట్ పూర్తి చేశారన్నమాట.  

Ante Sundaraniki Nani Special Interview

nani
nani interview
ante sundaraniki
nani special interview
ante sundaraniki nani special interview