ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్: వేరె లెవెల్

Celebrities reaction on RRR Trailer

రాజమౌళి.. మరోసారి మెస్మరైజ్ చేసారు.. బాహుబలి తో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టిన జక్కన్న మళ్లీ ఆర్.ఆర్.ఆర్ తో తన రికార్డులని తానే బద్దలు కొట్టడానికి రెడీ అయ్యారు. జనవరి 7 న బీభత్సమైన అంచనాలతో వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ట్రైలర్ ని ఈ రోజు డిసెంబర్ 9 న రిలీజ్ చేసారు మేకర్స్. అంచనాలకు మించి ఉన్న ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఫాన్స్ ని ఎంతగా ఆకట్టుకుందో కానీ.. సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల్ని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. జక్కన్న ఆర్.ఆర్.ఆర్ విశ్వరూపం చూసిన చాలామంది స్టార్స్ రాజమౌళి ని, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పెరఫార్మెన్స్ ని తెగ పొగిడేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

అందులో రౌడీ స్టార్స్ విజయ్ దేవరకొండ, పూజ హెగ్డే, టాప్ డైరెక్టర్స్ ఉన్నారు.

విజయ్ దేవరకొండ: చాలా గర్వంగా ఉంది, వేరే లెవల్‌ ట్రైలర్‌ ఇది

పూజ హెగ్డే: Ummm.. స్పీచ్ లెస్, జస్ట్ నిలబడి క్లాప్స్ కొట్టడం తప్ప, ఎంటైర్ టీం కి క్లాప్స్ కొడుతునాను ఎమోజిలతో తన స్పందన తెలియజేసింది. 

బాబీ: రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ఆర్.ఆర్.aar ట్రైలర్‌ ఆద్యంతం సర్‌ప్రైజ్‌

క్రిష్: ఆర్.ఆర్.ఆర్ ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌ కేరెక్టర్స్, ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. 

కరణ్ జోహార్: బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ కి ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ చూడగానే మతిపోయింది అంటూ ట్వీట్ చేసారు. రాజమౌళి సర్‌.. ట్రైలర్‌ చూస్తుంటే మతిపోతోంది. ఆర్.ఆర్.ఆర్ టీం కి కంగ్రాట్స్ చెప్పారు.

Stars reaction on RRR Trailer

rrr trailer
karan johar
rajamouli
vijay devarakonda
pooja hegde
director bobby
director gopichand malineni
rrr movie