మరో రెండు రోజుల్లో పవన్ సునామి
Pawan Birthday Special Updatesపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కి మరో రెండు రోజులు మాత్రమే టైం ఉంది. సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే వేడుకలని ఓ రేంజ్ లో తలపెట్టారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. పవనోత్సవం అంటూ హడావిడి చేస్తున్నారు. పవన్ బర్త్ డే రోజున ఆయన నటిస్తున్న సినిమాలు భీమ్లా నాయక్ నుండి సింగిల్ వదలబోతుంది టీం. ఇప్పటికే రిలీజ్ అయిన భీమ్లా నాయక్ టీజర్ కొత్త రికార్డులని సృష్టిస్తుంది. ఇక పవన్ తదుపరి చిత్రం హరహర వీరమల్లు నుండి కూడా ఏదో ఒక అప్ డేట్ రాకపోదు అని పవన్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
హరి హర వీరమల్లు రెస్యూమ్ షూట్ మొదలైన ఇంతవరకు అప్ డేట్ లేదు. మరో పక్క, భీమ్లా నాయక్ షూటింగ్ ని చక చకా పూర్తి చేస్తున్నారు మేకర్స్. భీమ్లా నాయక్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు నుండి రిలీజ్ డేట్ రావొచ్చని, పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఆ డేట్ ప్రకటించవచ్చని అంటున్నారు. మరోపక్క హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ టైటిల్ ని వదలొచ్చని పవన్ ఫాన్స్ ఊహించుకుంటున్నారు. మరి పవన్ బర్త్ డే సునామి ఎలా ఉంటుందో చూడాలి మరో రెండు రోజులు వెయిట్ చేస్తే తేలిపోతుంది.
Pawan Kalyan Birthday Special Updates







































