Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Malwani Police registers a fresh FIR against Raj Kundra and Gehana Vasisth

రాజ్ కుంద్రా-గహనాలపై మరో కేసు

Malwani Police registers a fresh FIR against Raj Kundra and Gehana Vasisth

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో పోలీస్ కష్టడీలో ఉన్నాడు. మరోపక్క శిల్పా శెట్టి కి కూడా ఈ కేసు లో ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పటికే భార్య భర్తల బ్యాంకు అకౌంట్స్ ని సీజ్ చేసింది ముంబై పోలీస్ శాఖ. అయితే రాజ్ కుంద్రా కేసులో చాలామంది నటీమణులు ఫిర్యాదులతో రాజ్ కుంద్రా చుట్టూ ఈ కేసు మరింతగా బిగుసుకుంటుంది. తాజాగా మరో నటి రాజ్ కుంద్రా, ఈ యాప్ లో పనిచేసి రీసెంట్ గా జైలుకెళ్లిన నటీమణి గహనా వశిష్టాలపై కేసు పెట్టింది. ముంబై కి చెందిన ఓ నటి.. తనతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు చేయించారని అంటూ పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

ఆ నటి ఇచ్చిన ఫిర్యాదుతో నటి గహనా వశిష్ఠ్‌తోపాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ కేసులో గాహన వసిష్ఠ అరెస్ట్ అయ్యి ఐదు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయట ఉంది. ఇప్పుడు గహన పై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కేసు లో షాకింగ్ నిజాలు ముంబై పోలీస్ లకి తెలిసాయని ఈ కేసులో రాజ్ కుంద్రా కి జైలు శిక్ష తప్పేలా లేదు అని అంటున్నారు. 

Fresh FIR against Raj Kundra in Pornography case

fresh fir
raj kundra
pornography case
raj kundra and gehana vasisth
gehana vasisth