హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అలియా భట్
Bollywood beauty Alia Bhatt landed in Hyderabadఆర్.ఆర్.ఆర్ లో సీత కేరెక్టర్ లో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సెకండ్ వేవ్ కి ముందే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ని పూర్తి చేసేసింది. అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ కి సంబందించిన ఓ సాంగ్ కోసం ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న కీలక నటులైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ లాంటి వాళ్ళు పాల్గొంటున్నారట. తాజాగా అలియా భట్ ముంబై నుండి హైదరాబాద్ కి ల్యాండ్ అయ్యింది కూడా.
ఈరోజే అలియా భట్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. గత వారమే ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ షెడ్యూల్ ని రాజమౌళి స్టార్ట్ చేసారు. ఇక అలియా భట్ కూడా పాల్గొనబోతున్న ఆర్.ఆర్.ఆర్ సాంగ్ కోసం ఏకంగా మూడు కోట్లు బడ్జెట్ పెడుతున్నారని టాక్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ కోసం అలియా భట్ వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ సీత కేరెక్టర్ నిడివి తక్కువ వున్నా అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ కథని ప్రభావితం చేస్తుంది అంటూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పడంతో అలియా భట్ సీత కేరెక్టర్ పై అంచనాలు పెరిగిపోయాయి.
Alia Bhatt flies to Hyderabad, saying Team RRR is here







































