పుష్ప లో బిగ్ ట్విస్ట్
Big Twist in Pushpaఅల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. భారీ బడ్జెట్ తో భారీ అంచనాలున్న పుష్ప సినిమా పోస్ట్ కరోనా షూట్ గోవాలో మొదలు కాబోతుంది. రష్మిక - అల్లు అర్జున్ అండ్ టీం గోవాకి వెళ్ళబోతున్నారు. పుష్ప రెండు పార్టుల్లో చూపించబోతున్నారు అనే దాని మీద రాకరకరాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో కల్డ్ మాస్ లుక్ లో కనిపిస్తున్న అల్లు అర్జున్ లుక్ పై భారీ అంచనాలున్నాయి.
ఇక అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఆ లుక్ లో ఆయన కాలికి ఆరు వేళ్ళు కనిపించాయి. అప్పట్లోనే ఈ విషయంపై అనేకరకరాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక సెకండ్ లుక్ చూస్తే అందులో ఐదువేళ్లే కనిపించాయి. దానితో అల్లు అర్జున్ తన ఒకవేలిని నరికేసుకుంటాడు.. అదే సినిమాలో బిగ్గెస్ట్ ట్విస్ట్ అంటూ ప్రచారం మొదలైంది. మరి ఈ కాలి వేళ్ళ టాపిక్ ఇప్పుడు టాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారింది. బన్నీ అసలెందుకు కాలి వేలిని నరికేసుకుంటాడు అంటూ ప్రశ్నల మీదప్రశ్నలు ప్రేక్షకుల్లో మొలకెత్తుతున్నాయి. ఇప్పుడు పుష్ప టీజర్ పై ఉన్న ఇంట్రెస్ట్ కన్నా బన్నీ కాలి వేళ్ళ మీద ఉన్న ఇంట్రస్ట్ జనాల్లో ఎక్కువైపోతోంది.
Allu Arjun Pushpa update







































