లైగర్ ఓటిటి ఆఫర్ - రౌడీ హీరో స్పందన
Vijay Devarakonda rubbishes Liger OTT rumoursఈమధ్యన చిన్న సినిమాలే కాదు.. భారీ బడ్జెట్ సినిమాలపైనా ఓటిటి రూమర్స్ వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ రాధే సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యాక ప్రభాస్ రాధే శ్యామ్ వెంట జీ ప్లెక్స్ పడింది. కానీ రాధేశ్యామ్ టీం ఓటిటికి ఒంగలేదు. థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఖరాఖండిగా చెప్పారు. తాజాగా విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న లైగర్ మూవీకి అదిరిపోయే ఓటిటి ఆఫర్ వచ్చిందట. లైగర్ సాలా కా బ్రీడ్ అంటూ క్రేజ్ పెంచేసిన ఈ సినిమాకి ఓటిటి నుండి 200 కోట్ల ఆఫర్ వచ్చిందట. ఓ ప్రముఖ ఓటిటి సంస్థ లైగర్ ని థియేటర్స్ లో కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్ , శాటిలైట్ ప్రసార హక్కులకు కలిపి 200 కోట్ల భారీ మొత్తం ఆఫర్ చేసినట్టు సమాచారం.
అయితే లైగర్ ఓటిటి ఆఫర్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. లైగర్ సినిమాకు 200 కోట్ల ఓటీటీ, శాటిలైట్ డీల్ చాలా తక్కువ. అదే థియేటర్స్‌లో రిలీజ్ అయితే ఈ సినిమాకు అంతకంటే ఎక్కువే వసూళు చేస్తుంది అంటూ ఓ ట్వీట్ చెయ్యడంతో విజయ్ ఫాన్స్ లైగర్ మూవీ పై మరింత అంచనాలు పెంచేశావ్ గా రౌడీ హీరో అంటున్నారు. పూరి - ఛార్మి - కరణ్ జోహార్ లు కలిసి 125 కోట్లతో లైగర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. విదేశీ ఫైటర్స్ తో విజయ్ దేవరకొండ క్లైమాక్స్ కోసం చేసే ఫైట్ సినిమాకే హైలెట్ అంటున్నారు. విజయ్ తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే రొమాన్స్ చేస్తుంది.
Rowdy Star powerful take on Liger release







































