టీఎస్: పదవ తరగతి పరీక్షలు రద్దు
Telangana 10th exams cancelledనిన్న సెంట్రల్ గవర్నమెంట్ CBSC 10th ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసింది. కారణం కరోనా సెకండ్ వెవ్. 10th ఎగ్జామ్స్ ని రద్దు చేసిన CBSC బోర్టు 12th ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసింది. అయితే కరోనా సెకండ్ వెవ్ పలు రాష్ట్రాల్లో ఉధృతంగా ఉంది. దాని వలన ఇంటర్, 10th స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ ని వాయిదా వెయ్యాలా? లేదంటే రద్దు చెయ్యాలా? అనే సస్పెన్స్ లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. ఏపీ రాష్ట్రంలో కరోనా తో టీచర్స్ కన్ను మూయడం కలకలం రేపగా.. విద్యార్థులు కరోనా బారిన పడడం అందరిని భయబ్రాంతులకు గురి చేస్తుంది.
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడగా.. కరోనా ఉధృతి కారణంగా ఉదయం నుండి 10th, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు, వాయిదా విషయంలో జరిగిన మీటింగ్స్ లో భాగంగా తెలంగాణ పదవ తరగతి పరీక్షలని రద్దు చేస్తూ తెలంగాణా విద్యాశాఖ జీవో జారీ చేసింది. ఇక ఇంటర్ పరీక్షలు పోస్ట్ పోన్ చేసే విషయం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. కరోనా కారణంగా నిన్న CBSC నేడు టీఎస్ 10th ఎగ్జామ్స్ ని రద్దు చేసారు.
Telangana SSC Exams 2021 cancelled







































