వింటేజ్ పవర్ స్టార్ అండ్ కంటిపాప సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ నుండి ఫాన్స్ కి సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. సత్యమేవ జయతే సాంగ్ విడుదలైన తక్కువ సమయానికే మళ్ళీ వకీల్ సాబ్ నుండి కంటి పాప కంటి పాప సాంగ్ ని రిలీజ్ చేసింది వకీల్ సాబ్ టీం. థమన్ మ్యూజిక్ అందిస్తున్న వకీల్ సాబ్ ఆల్బమ్ లోని సాంగ్స్ ఫాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేస్తున్నాయి. వకీల్ సాబ్ లో మాంటేజ్ సాంగ్ గా కనిపించబోతున్న కంటి పాప్ కంటిపాప సాంగ్ కి సంబందించిన కొన్ని స్టిల్స్ కూడా ప్లే చేసారు ఆ లిరికల్ సాంగ్ లో. ప్రతి స్టిల్ లోనూ పవన్ కళ్యాణ్ ని చూస్తే వింటేజ్ పవర్ స్టార్ గుర్తొచ్చాడు. స్టైలింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అది కాకుండా పవన్ కళ్యాణ్ చాలా యాక్టీవ్ గాను, ఎనేర్జిటిక్ గా కనిపించడం ఫాన్స్ బాగా ఇంప్రెస్స్ చేస్తుంది. ఈ సాంగ్ తో వకీల్ సాబ్ కి ఓ కొత్త కళ రాబోతుంది.
ఇక ఈ ఏడాది క్రాక్ సినిమాతో కం బ్యాక్ అయిన శృతి హాసన్.. ఆ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. క్రాక్ సినిమాలో శృతి హాసన్ చేసిన ఫైట్ కి మీ అభిమానులు ఫిదా అయితే.. ఈ వకీల్ సాబ్ లో శృతి హాసన్ కూల్ లుక్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. తన గబ్బర్ సింగ్ జోడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ ఈ సినిమాలో చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఏప్రిల్ 9 న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 3 వ తేదీన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది. ఈ ఫంక్షన్ డీటెయిల్స్ మరియు ఈ ఫంక్షన్ కి రాబోతున్న చీఫ్ గెస్ట్ ఎవరనేది నెక్స్ట్ అప్ డేట్ లో..
Kanti Papa Kanti Papa song in Power star Pawan Kalayan - Sruthi Hasan Vakeel Saab Movie
Kanti Papa Kanti Papa song in Vakeel Saab







































