ఈ కాంబోలో మూవీ అంటే.. ఆకాశమే హద్దులు!
Mega fans expected Ram Charan and Prashanth Neel comboకన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 తర్వాత తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. కెజిఎఫ్ తర్వాత ఖచ్చితంగా తెలుగు హీరోతోనే ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది అది పక్కా. అయితే అది ఎన్టీఆర్ తోనా? లేదంటే ప్రభాస్ తోనా? అనేది ప్రశాంత్ నీల్ కే క్లారిటీ లేదు. ఎన్టీఆర్ RRR తర్వాత త్రివిక్రమ్ తోనూ, ప్రభాస్ రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ మూవీ, ఆదిపురుష్ సినిమాలను వరసగా చేస్తున్నాడు. మరి ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఎవరు అనే దానిమీద అందరిలో ఫుల్ సస్పెన్స్ ఉంది. అయితే ప్రశాంత్ నీల్ స్టార్ హీరో రామ్ చరణ్ తో తన నెక్స్ట్ సినిమా చేస్తే అనే ఆలోచనే మెగా ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించేస్తోంది.
ఎటూ రామ్ చరణ్ RRR తర్వాత ఆచార్య సినిమా అయ్యాక మరో సినిమాకి కమిట్ అవ్వలేదు. ఏ డైరెక్టర్ వచ్చి కథ చెప్పినా నాన్నగారికి సెట్ చేస్తున్న చరణ్ నెక్స్ట్ పై కూడా అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. హీరోలంతా వరసబెట్టి సినిమాల మీద సినిమాలు లైన్ లో పెడుతుంటే.. రామ్ చరణ్ మాట్లాడడం లేదు. నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నాడు అని అందరూ అంటున్నారు. అలాంటి టైం లో కెజిఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా సెట్ అయితే షాకవ్వాల్సిందే. ఒకవేళ రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ ని కథ చెప్పమంటే మేఘాల్లో ట్రావెల్ చేసి మెగా కాంపౌండ్ లో వాలిపోయేలా ఉన్నాడు ప్రశాంత్ నీల్. మరి చరణ్ గనక ప్రశాంత్ నీల్ కి అవకాశమిస్తే... ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కడం ఖాయం.. ఆ సినిమాపై ఆకాశంలో అంచనాలు ఉండడము ఖాయమే.
Movie in Ram Charan and Prashanth Neel combo







































