ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sachin Response on Harbhajan Singh Friendship Movie

‘ఫ్రెండ్ షిప్’ ఫ‌స్ట్‌లుక్‌పై స్పందించిన సచిన్!

Sachin Response on Harbhajan Singh Friendship Movie

హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్రెండ్ షిప్’ ఫ‌స్ట్‌లుక్ కి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందన

ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్రెండ్ షిప్’ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ లో హర్భజన్ సింగ్ షేర్ చేయగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ, ‘‘ఫ్రెండ్ షిప్ గురించి అయితే తప్పకుండా చూడాల్సిందే, భజ్జీ’’ అని ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్ ‘ఫ్రెండ్ షిప్’ సినిమా మీద అందరిలో మరింత ఆసక్తి పెంచింది.

త‌మిళ  బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల‌లో యాక్షన్ కింగ్ అర్జున్, త‌మిళ న‌టుడు స‌తీష్‌ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ మరియు స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Sachin tweeted on Harbhajan Singh Friendship

sachin
tweet
harbhajan singh
friendship
motion poster