ఒకేసారి రెండు సినిమాలు..దర్శకుడు తేజ సాహసం...

Director Teja registered two titles

రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసి ఆ తర్వాత చిత్రం సినిమా ద్వారా దర్శకుడిగా మారి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు తేజ ప్రస్తుతం రెండు సినిమాలని లైన్లో పెట్టాడట. ఈ సీనియర్ దర్శకుడు చాలా రోజుల తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. రానా హీరోగా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ కావడంతో తేజ ఫామ్ లోకి వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ అలా అనుకునే లోపే మళ్ళీ సీత సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు.

 

సీత తర్వాత  మళ్ళీ ఇప్పటి వరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. అప్పట్లో ఉదయ్ కిరణ్ జీవిత కథని తెరకెక్కిస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ వాటి మీద తేజ స్పందించలేదు. అయితే ప్రస్తుతం తేజ రెండు సినిమాలతో మన ముందుకి వస్తున్నాడట. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని తేజ రెండు సినిమా టైటిళ్ళని రిజిస్టర్ చేయించాడట. ఆ టైటిల్స్ చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అలివేలు మంగ వెంకటరమణ, రాక్షసరాజు రావణాసురుడు వంటి టైటిళ్ళని తన తర్వాతి సినిమాలుగా రిజిస్టర్ చేయించాడని సమాచారం. 

 

అయితే వీటిలో ఒక సినిమాని గోపీచంద్ తోనూ, మరోటి రానాతోనూ తీస్తున్నాడట. మరి వీరిద్దరిలో ఎవరితో ముందు వస్తున్నరనేది మాత్రం తెలియట్లేదు. కానీ అంచనా ప్రకారం రానా తన ఇతర కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నాడు కాబట్టి గోపీచంద్ తో ముందు వస్తాడని అనుకుంటున్నారు.

Director Teja coming with Two ned different movie titles

teja
gopi chand
rana daggubati