ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> News About Venky and Producer Dil Raju!

వెంకీ దెబ్బకు ఆలోచనలో పడ్డ దిల్‌రాజు!?

News About Venky and Producer Dil Raju!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్.. కుర్ర హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్‌2’ మూవీ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో.. ఏ మాత్రం కలెక్షన్ల వర్షం కురిసిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా నుంచే అనిల్ రావిపూడి దశ కూడా తిరిగింది. ఆ తర్వాతే సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు సైతం పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అదే సీక్వెల్‌లో సినిమా ఎప్పుడో చెప్పిన ఆయన.. ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఎఫ్-3 తీయాలని ఆయన అనుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. నారప్ప (అసురన్) షూటింగ్ అవ్వగానే వేసవి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నాడు.

ఈ  క్రమంలో వెంకీ రెమ్యునరేషన్ గురించి చర్చించే పనిలో చిత్రబృందం నిమగ్నమైందట. అసలు ఆయనకు పారితోషం ఇచ్చుకోవాలా..? లేకుంటే లాభాల్లో వాటా ఇవ్వాలా..? అనేది నిర్మాత దిల్‌రాజుకు అర్థం కావట్లేదట. ఏదైతే బాగుంటుందని నిర్మాత ఆలోచనలో పడ్డారట. పారితోషికం ఇవ్వాల్సి వస్తే.. గతంలో కంటే ఎక్కువే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పారితోషికం అయినా లాభాలు అయినా సరే ఈసారి వెంకీకి మాత్రం గట్టిగానే ముట్టనుందట. ఈ సంగతేంటో తేలితే వెంకీ లేకుండా ఉంటే సన్నివేశాలను చిత్రీకరించాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నాడట. మరి దిల్‌రాజు లెక్క ఎప్పుడు తేలుస్తాడో..? వెంకీ ఎప్పుడు ఓకే అంటాడో..? అనిల్ షూటింగ్ ఎప్పుడు షురూ చేస్తాడో ఏంటో..!

News About Venky and Producer Dil Raju!

venky
venkatesh
f3
producer dil raju