ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ala Vaikunthapurramloo Teaser Release Date Fixed

‘అల వైకుంఠపురములో’ టీజర్ ఎప్పుడంటే..?

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ టీజర్ డిసెంబర్ 11న విడుదల కానుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’, ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి తదితరులు ఈ చిత్రంలోని తారాగణం.

సాంకేతిక నిపుణులు :

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, 

సంగీతం: థమన్.ఎస్,

ఎడిటర్: నవీన్ నూలి: 

ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,

ఫైట్స్: రామ్ - లక్ష్మణ్

పీఆర్వో: లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్

నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Ala Vaikunthapurramloo teaser to be out on December 11th

Ala Vaikunthapurramloo Teaser Release Date Fixed
ala vaikunthapurramloo
teaser release date
december 11th
allu arjun
trivikram srinivas
pooja hegde