Advertisementt

‘డిస్కోరాజా’ టీజర్: సరికొత్తగా ఉంది

Sat 07th Dec 2019 11:22 AM
mass maharaj,raviteja,disco raja,teaser,released  ‘డిస్కోరాజా’ టీజర్: సరికొత్తగా ఉంది
Mass Maharaj Raviteja Disco Raja Teaser Released ‘డిస్కోరాజా’ టీజర్: సరికొత్తగా ఉంది
Advertisement
Ads by CJ

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. డైనమిక్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఈ సినిమా, టీజర్ తాజాగా రిలీజ్ అయింది, సైన్స్ ఫిక్షన్ జానర్ లో డిస్కోరాజా రెడీ అవుతుంది అని ఈ చిత్ర బృందం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన టీజర్ ని కూడా సిద్ధం చేసినట్లుగా దర్సకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. ఎంతో శ్రమతో, హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో ఐస్లాండ్ తదితర ప్రాంతాల్లో తీసిన విజువల్స్ తో టీజర్ రూపొందించామని. అలానే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ల్యాబ్ సెట్ లో తీసిన షాట్స్ కూడా టీజర్ లో వాడినట్లుగా ఆనంద్ చెప్పారు. ఇక మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఈ సినిమాలో ఉన్న అయన రిట్రో గెట్ అప్ పై ఉన్న యాక్షన్ షాట్స్ తో ఈ టీజర్ ఎండింగ్ చేయడం జరిగింది అని చెప్పారు వి ఐ ఆనంద్. టీజర్ స్టార్టింగ్ లో రవితేజ గారు చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడం ఖాయం అని, రవితేజ ఫ్యాన్స్ తో  పాటు అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చే విధంగా డిస్కోరాజాని సిద్ధం చేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు. జనవరి 24 న భారీ స్థాయిలో డిస్కోరాజా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు రామ్ తళ్లూరి చెప్పారు. 

న‌టీన‌టులు 

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం 

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

ప్రొడక్షన్ - రామ్ తళ్లూరి

సమర్పణ - సాయి రిషిక

నిర్మాత : రజిని త‌ళ్లూరి

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్  : కార్తీక్ ఘట్టమనేని

డైలాగ్స్ : అబ్బూరి రవి

మ్యూజిక్ : థ‌మన్. ఎస్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి

Click Here For Teaser

Mass Maharaj Raviteja Disco Raja Teaser Released:

Raviteja Disco Raja Teaser Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ