Advertisementt

‘దొంగ’లో యాక్షన్‌తో పాటు ఎమోషన్ ఉంటుందట!

Sun 24th Nov 2019 02:42 PM
karthi,donga,movie,second look,released  ‘దొంగ’లో యాక్షన్‌తో పాటు ఎమోషన్ ఉంటుందట!
Karthi Donga Movie Second Look Released ‘దొంగ’లో యాక్షన్‌తో పాటు ఎమోషన్ ఉంటుందట!
Advertisement
Ads by CJ

దొంగ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి అందరూ కనెక్ట్ అవుతారు - యాంగ్రీ  హీరో కార్తీ

ఖైదీ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగగా రాబోతున్నాడు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ ఫస్ట్ లుక్ ను ఇటీవలే హీరో సూర్య, టీజర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ... ‘‘‘దొంగ’ నా కెరీర్ లో మరో విభిన్న చిత్రం. వెరైటీ చిత్రాలని ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దొంగలో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి అందరూ కనెక్ట్ అవుతారు. మా వదిన గారు జ్యోతిక ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సత్యరాజ్ గారు మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నా కెరీర్ లో మరో మెమొరబుల్ ఫిలిం.’’ అన్నారు.

నిర్మాణ సంస్థలు వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌ సినిమా గురించి వెల్లడిస్తూ... ‘‘షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.’’ అన్నారు.      

ఖైదీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కార్తీకి దొంగ మరో బ్లాక్ బస్టర్ కాబోతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.  

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

Karthi Donga Movie Second Look Released:

Action and Emotion in Donga Movie.. says Karthi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ