ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Spiderman Far From Home Movie Latest Update

‘స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ఫ్ర‌మ్ హోం’ ఇండియాలో ముందే!

Spiderman Far From Home Movie Latest Update

అభిమానుల డిమాండ్ మేర ఇండియాలో ముందుగానే విడుద‌ల‌వుతున్న ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’

వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో స్పైడ‌ర్ మ్యాన్‌. అవెంజ‌ర్స్ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’ రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’ సిద్ధ‌మ‌వుతోంది. 

‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’ చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా విడుద‌ల చేస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మార్వెల్ సంస్థ నుండి వ‌స్తున్న సినిమాల‌పై క్రేజ్ క్ర‌మంగా పెరుగుతుంది. ఈ సంద‌ర్భంగా... 

సోనీ పిక్చ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ.. ‘‘సూప‌ర్‌హీరో స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే ‘స్పైడ‌ర్ మ్యాన్:  ఫార్ ఫ్ర‌మ్ హోం’పై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమాను జూలై 4న విడుద‌ల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

Spiderman Far From Home Movie Release Details

spiderman far from home movie
release
july 4