పెళ్లి చేసుకుంటే జీవితం నాశనమే: స్టార్ హీరో!
Star Hero Comments on Marriageఇప్పటికీ ఇండియాలో ఉన్న మోస్ట్ వాటెంటెడ్ బ్యాచ్‌లర్ ఎవరు? అని ప్రశ్నిస్తే ఇప్పటికే ఐదు పదుల వయసు దాటి నాలుగేళ్లు గడిచిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ పేరే చెబుతారు. ఆయన తన జీవితంలో ఎందరితోనో ఎఫైర్లు నడిపాడు కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఆయన ‘భారత్’ చిత్ర ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ, జీవితంలో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. పెళ్లి చేసుకుంటే జీవితం అక్కడితో ఆగిపోతుంది. జీవితం, కెరీర్ అన్నవి అక్కడి నుంచి పతనం అవ్వడం మొదలుపెడతాయి. పెళ్లి చేసుకుంటే నా కెరీర్ మరింత బాగా ఉంటుందనే నమ్మకం నాకు లేదు. అందుకే నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదు... అని చెప్పుకొచ్చాడు.
ఈ మాటలు వింటే భవిష్యత్తులో కూడా సల్మాన్ పెళ్లి చేసుకోడని అర్ధమవుతోంది. మరి పెళ్లి లేకపోతే మీకంటూ వారసులు ఉండరు కదా? అని అడిగితే సమయం వస్తే అన్ని జరిగిపోతాయి అని సమాధానం ఇచ్చాడు. మొత్తానికి సల్మాన్‌లో వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదని తేలిపోతోంది. ఆయన ప్రస్తుతం తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి ఎఫైర్‌లో ఉన్నాడని బిటౌన్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
Salman Khan Sensational Comments on Marriage







































