‘సువర్ణ సుందరి’ విడుదల ఎప్పుడంటే?

Suvarna Sundari Release Date Fixed

పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్ల‌గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  రీతిలో ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న  ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... సువర్ణ సుందరి  చిత్రంలో విఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది.  టైమ్ తీసుకున్నా ఔట్పుట్ మాత్రం అద్భుతంగా వ‌చ్చింది. గత కొంతకాలంగా తెలుగులో స్క్రీన్‌ప్లే బెస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. సువర్ణ సుందరి సైతం మూడు జన్మల కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే తో రూపొందిచాము. ఆడియెన్స్‌ను ఆకట్టుకోవటంతో పాటు, కమర్షియల్‌ గా పక్కా హిట్ కొడతామన్న నమ్మంకంతో ఉన్నామన్నారు.

నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..‌ సువర్ణ సుందరి చిత్ర ట్రైలర్ ‌సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఆకట్టుకుంది. బడ్జెట్ ఎక్కువయినా , క్వాలిటీ ఔట్పుట్ చూశాక సినిమా విజయంపై  చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి  సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

Suvarna Sundari Release on May 30

suvarna sundari
release date
jayapradha