పూరి ఫోకస్ అంతా ఆ హీరోయిన్‌పైనే!

డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ తొలిసారిగా ఓ సినిమా రాబోతుంది. దీనికి ‘ఇస్మాట్ శంకర్’ అనే టైటిల్‌ను పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవ్వనుంది. ఇక ఈచిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్.. రామ్‌తో స్టెప్స్ వేయనున్నారు.

అయితే ఈ చిత్రం నుండి తాజా అప్‌డేట్ ఏంటంటే.. ఇందులో హీరోయిన్ నభా నటేష్ క్యారెక్టర్ వినూత్నంగా ఉండబోతుందట. సాధారణంగా పూరి సినిమాల్లో హీరోలకు రాసే క్యారెక్టరైజేషన్‌ను ఈసారి హీరోయిన్‌కి రాశాడట. ఈ పాత్ర చాలా సరదాగా కొత్తగా ఉంటుందని సమాచారం. అయితే నభా పాత్ర సినిమాలో కొద్ది సేపు మాత్రమే ఉంటుందని టాక్.

ఇక ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. మణిశర్మ మ్యూజిక్ అందించనున్నారు. పూరితో పాటు ఈ చిత్రాన్ని ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్‌ను ఫినిష్ చేసి రెండో షెడ్యూల్‌కు వెళ్లనుంది టీం.

Heroine Nabha Natesh Highlight in ismart shankar

Ismart Shankar Latest Update
nabha natesh
puri jagannadh
ismart shankar
ram
charmi
pokiri