వావ్.. సుడంటే ‘సుబ్రహ్మణ్యపురం’దే..!!

Subrahmanyapuram turns Safe Project

ఈ శుక్రవారం  వచ్చిన సినిమాల్లో సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ జనాలు ఈ సినిమానే చూడటానికి ఇష్టపడుతున్నారు. హీరో హీరోయిన్‌ల రెమ్యూనరేషన్ పక్కనపెడితే సినిమాకు కోటి రూపాయలు ఖర్చు చేశారట. కోటి రూపాయలతో ఈ సినిమాను ముగించేశారని తెలుస్తుంది.

అయితే ఇప్పుడా కోటి రూపాయలు కేవలం ఒకే ఒక్క డీల్ తో నిర్మాతలకు తిరిగొచ్చేసింది. అది కూడా శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో. అవును ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోటి రూపాయలకు అమ్ముడుపోయిందని సమాచారం.  జీ తెలుగు ఛానెల్ ‘సుబ్రహ్మణ్యపురం’ ను దక్కించుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి. దీంతో థియేట్రికల్ గా కూడా ఈ సినిమా లాభాలు కళ్లజూసే ఛాన్స్ ఉంది.

సుమంత్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఇప్పటివరకు ఏ సినిమాకు శాటిలైట్ రూపంలో ఇంత మొత్తం రాలేదు. సో దాంతో మనోడి రేంజ్ పెరిగిందనే చెప్పాలి. అలా పెట్టిన పెట్టుబడి మొత్తం కేవలం ఈ ఒక్క డీల్ తోనే వచ్చేసింది.

Subrahmanyapuram Satellite Rights sold out

sumanth
subrahmanyapuram
satellite rights
sold