ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vidya Balan is Not Jr NTR's Wife - Raj Tarun

అలా రాస్తే.. ఎవరికైనా మండుతుంది!

Vidya Balan is Not Jr NTR's Wife - Raj Tarun

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన తండ్రి సీనియర్‌ ఎన్టీఆర్‌ జీవితచరిత్రలో తన తండ్రి పాత్రను చేస్తున్నాడు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో తాజాగా ఎన్టీఆర్‌ భార్య పాత్రను పోషిస్తోన్న విద్యాబాలన్‌ కూడా పాల్గొంది. విద్యాబాలన్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం కావడం , సీనియర్‌ ఎన్టీఆర్‌ నటునిగా, రాజకీయ నాయకునికి అందరికి పరిచయం ఉండటం, క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండటం వంటివన్నీ ఈ చిత్రానికి మంచి ప్రమోషన్‌గా ఉపయోగపడుతున్నాయి. 

సో.. ఈ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ మీద బాలీవుడ్‌ మీడియా కూడా ఓ కన్నేసింది. అక్కడ కూడా ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ ఆంగ్లపత్రిక సీనియర్‌ ఎన్టీఆర్‌కి భార్య బసవతారకంగా విద్యాబాలన్‌ నటిస్తోందని రాయబోయి, జూనియర్‌ ఎన్టీఆర్‌కి భార్యగా విద్యాబాలన్‌ నటిస్తోందని రాయడం, అది యువ హీరో రాజ్‌తరుణ్‌ కంట్లో పడటం జరిగింది. దీనిపై రాజ్‌తరుణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ న్యూస్‌ని ఉద్దేశంచి రాజ్‌తరుణ్‌ స్పందిస్తూ, బసవతారకం గారు సీనియర్‌ ఎన్టీఆర్‌కి సతీమణి. ఆమె జూనియర్‌ ఎన్టీఆర్‌కి నానమ్మ అవుతుంది. 
విద్యాబాలన్‌ గారు ఇందులో సీనియర్‌ ఎన్టీఆర్‌కి భార్యగా నటిస్తున్నారు. దయచేసి వార్తలు రాసేటప్పుడు, ప్రచురించే ముందు జాగ్రత్తగా పరిశీలించుకుని రాయండి. ధన్యవాదాలు.. అంటూ ఆ వార్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బసవతారకంగా నటిస్తున్న విద్యాబాలన్‌ షూటింగ్‌కి వచ్చిన సందర్భంగా బాలకృష్ణ ఆమెని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమెకి బాలయ్య సోదరి లోకేశ్వరి పట్టుచీరను కానుకగా ఇచ్చారు.

Raj Tarun Slams English Media House For Making A Blunder

vidya balan
jr ntr
ntr
basavatarakam
english media