సన్నీలో ఈ కోణం చూస్తారా..?
Sunny Leone Web Series Trailer Releasedపోర్న్‌స్టార్, బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రాంతీయ భాషల్లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్న సెక్స్‌బాంబ్ సన్నిలియోన్. ప్రస్తుతం ఆమె జీవితంపై 'కరణ్‌జీత్‌కౌర్..... ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నిలియోన్' పేరిట ఓ బయోపిక్ రూపొందుతోంది. అయితే ఇది చలన చిత్రంగా కాకుండా ఓ వెబ్‌సిరీస్‌గా రూపొందుతోంది. ఇటీవలే దానిని చూసి రాత్రంతా నిద్ర పోకుండా ఏడుస్తూ ఉన్నానని, తన నిజజీవితం గురించి ఆలోచిస్తూ కుమిలిపోయానని, తనకంటూ దేవుడు వరం అందిస్తే పోర్న్‌స్టార్ కాకముందు జీవితాన్ని కోరుకుంటానని సన్నిలియోన్ భావోద్వేగం చెందిన విషయం తెలిసిందే.
ఈ వెబ్‌సిరీస్‌కి చెందిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో సన్ని పాత్రను రైసా సౌజాని అనే అమ్మాయి పోషించింది. సన్నికి మేకప్ వేస్తున్న దృశ్యంతో ఈ ట్రైలర్ మొదలైంది. అనంతరం చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అవమానాలు, తల్లిదండ్రులు తిట్టడం, మోడలింగ్‌లోకి అడుగుపెట్టడం, ఫొటో షూట్లు, ఇంటర్వ్యూలో సన్నిని అసభ్యంగా అడిగిన ప్రశ్నలు వంటివి చూపించారు.
ఈ వెబ్‌సిరీస్ ఈనెల 16నుంచి ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం కానుంది. మరి ఈ వెబ్‌సిరీస్ దాని నిర్వాహకులకు ఆర్ధికంగా ఎలాంటి లాభాలను అందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ వెబ్‌సిరీస్‌లో సన్ని కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.
Web series Based on Sunny Leone’s life to release on July 16







































