ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bunny Vas expresses his concerns over release date

2.0 సంగతేంటో తేలుస్తాం..: బన్నీ వాస్!

Bunny Vas expresses his concerns over release date

అసలు బన్నీ వాస్ ఈ మధ్యన మాట్లాడే మాటలు చూస్తుంటే.. అసలు ఆయనే కావాలని మాట్లాడుతున్నాడా? లేదా ఎవరైనా వెనుకుండి నడిపిస్తున్నారా? అనే అనుమానం వచ్చేస్తుంది.  ఎక్కడ వివాదం ఉంటే అక్కడ కనిపిస్తున్నాడు బన్నీ వాస్. భరత్ అనే నేను, నా పేరు సూర్య రిలీజ్ డేట్స్ విషయంలో దానయ్యతో ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. మరోవైపు నంది అవార్డుల విషయంలో వివాదాన్ని మెగా క్యాంప్ నుండి కెలికాడు. ఇప్పుడు రజనీకాంత్ నటించిన 2.0 సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు ఏంటి చేసేశాడు.

2.0 నిర్మాతలైన  లైకా ప్రొడక్షన్స్ కు.. సూపర్ స్టార్ రజినీకాంత్ - శంకర్ కలయికలో వస్తున్న 2.0 సినిమా పై మాకు గౌరవం వుంది . కానీ ఆ సినిమా రిలీజ్ డేట్స్ ను మీరు మార్చడం వల్ల ప్రాంతీయ సినిమాలపై ఆ ప్రభావం ఎంతగానో పడుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 27 రిలీజ్ డేట్ కోసం నేను, దానయ్య చర్చల్లో ఉన్నాం. అయితే ఈ వ్యవహారాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో పాటు ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తాను. అలాగే చెప్పిన రిలీజ్ డేట్ కు మేం కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో ప్రాంతీయ సినిమాల విడుదలకు మా ఈ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాను... అంటూ 2 .0  రిలీజ్ డేట్స్ పై బన్నీ వాస్ స్పందన.

మరి బన్నీ వాస్ మాట్లాడింది కరెక్ట్. ఎందుకంటే... 2.0  నిర్మాతలు తమ సినిమా విడుదల తేదీ క్లారిటీ ఇవ్వకుండా.. ఏప్రిల్ లో మా సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అంటూ ప్రెస్ నోట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. ఒకవైపు భరత్ అనే నేను, నా పేరు సూర్యలు ఏప్రిల్ 27 కోసం తర్జనభర్జన లు పడుతుంటే...  ఇప్పుడీ రేసులోకి 2.0 సినిమాతో లైకా ప్రొడక్షన్స్ కూడా ఎంటర్ అవ్వడంతో బన్నీ వాసుకు కోపం కట్టులు తెంచుకుంది. 

The dinosaur of Indian Cinema Robo 2.0 has been postponed from January and is eyeing April release. Bunny Vas took to his twitter account and expressed his concerns.

bunny vas
release date
naa peru surya
bharath ane nenu
2.0 movie