నాభి అందాలపై కామెంట్స్ ని ఎంజాయ్ చేస్తోంది!

Amala's Navel Under Scanner

అమలాపాల్‌.. ఈమె ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పెద్దగా గ్లామర్‌షో చేసేది కాదు. పక్కింటి అమ్మాయిలా సింపుల్‌ డ్రస్‌లతో, సంప్రదాయ దుస్తులలో కనిపిస్తూ మెప్పించింది. కానీ ప్రస్తుతం వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్‌లో కూడా పలు వివాదాలతో సహవాసం చేస్తోంది. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం 'తిరుత్తి పయరే2'లో చేస్తోంది. ఈ చిత్రం పోస్టర్టలో ఆమె నడుం అందాలను, నాభి అందాలను చూపిస్తూ శృంగార ప్రియులకు ఎక్కడలేని అనందాన్ని అందిస్తోంది. ఈ చిత్రం తెలుగులో 'దొంగోడొచ్చాడు' అనే టైటిల్‌తో 30న విడుదల కానుంది. ఇందులోని ఈమె ఫోటోలలో లుక్స్‌పై తీవ్ర విమర్శలు, ఆమె హద్దు మీరుతోందని కామెంట్స్‌ వస్తున్నాయి. 

దానిపై ఆమె స్పందిస్తూ.. నా నడుము, బొడ్డుపై ఇంతగా కాంట్రవర్శీ చెలరేగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మనం 2017లో జీవిస్తున్నాం ఇప్పటికీ ఇంత సెన్సిటివ్‌ అయితే ఎలా అని ప్రశ్నిస్తోంది. మరోవైపు ఈమె తాను ఫుల్‌గా ఎంజాయ్‌ చేయడం కోసం హిమాలయాలకు వెళ్లింది. అక్కడ కారు, బస్సు అన్నింటిని వదిలేసి బైక్‌పై దూసుకెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలను పోస్ట్‌ చేసింది. 

ఈమె మాట్లాడుతూ, మన మనసుకు, ఆలోచనలకు రెక్కలు రావడమే ఫ్రీడమ్‌ అని నేను భావించడం లేదు. అది మనసుకి అటాచ్‌ అయివుండదు. భరించలేనంత ఆనందంగా ఉండటమే ఫ్రీడమ్‌ అంటే. ఆ ఆనందం మన మనసుకి తెలియాలి.. అంటూ ఫ్రీడంపై లెక్చర్‌ ఇస్తోంది. 

Amala on her controversial navel poster Dongodochhadu

amala paul
dongodochadu
navel poster