దిల్‌రాజు పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు..!

Plagiarism Charges on Dil Rajun!

నిర్మాత దిల్‌రాజు పెద్దగా ఇతర సినిమాల గురించి,లేనిపోని విషయాలను మాట్లాడడు. ఎవరి గురించైనా మాట్లాడాడంటే ఆ హీరోతో ఆయన సినిమా తీస్తున్నాడని ఫిక్స్‌ అయిపోవచ్చు. ఇక ఆయన ఎక్కువగా తన చిత్రాల గురించే మాట్లాడుతూ, వివాదాల జోలికి వెళ్లడు.అలాగే వివాదాస్పద స్టోరీలను, ఇతరుల కథలను కాపీ కొట్టడం ఆయనకు అలవాటులేదు. కానీ తాజాగా ఆయన చిత్రంపై కూడా దుమారం చెలరేగుతోంది. 2011వ సంవత్సరంలో దిల్‌రాజు తాను నిర్మాతగా, కథ, దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా 'మిష్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రం నిర్మించి, విజయం సాధించాడు. 

తాజాగా ఓ నవలా రచయిత్రి 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' కథ తనదని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తాను రచించిన 'నా మనసు నిన్నుకోరే' నవల ఆధారంగా, అందులోనూ తన అనుమతిలేకుండా ఈ చిత్రం రూపొందిందని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాపీరైట్‌ యాక్ట్‌తో సహా పలు సెక్షన్ల కింద దిల్‌రాజుపై కేసులు పెట్టింది. కాగా ఈ చిత్రాన్ని నిర్మించింది దిల్‌రాజే అయినా ఆ కథను తయారుచేసింది. దర్శకత్వం వహించింది మాత్రం దశరథే. 

ఇక ఈ సినిమా కథనాదేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్యామలారాణి ఈచిత్రం విడుదలైన వెంటనే ఫిర్యాదు చేయకుండా ఆరేళ్ల తర్వాత కేసు పెట్టడం ఏమిటి? అనేదానిపై ఎన్నో అనుమానాలున్నాయి. ఇక ఈమధ్య కథల విషయంలో ఎన్నోవివాదాలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో రూపొందిన 'రాబ్తా' కథ తనదేనని అల్లు అరవింద్‌ కోర్టు మెట్లెక్కాడు. అసలు 'మగధీర' కథ తనదేనని ఓ రచయిత గొడవ చేస్తున్నాడు. తాను ప్రజల చైతన్యం చేసేందుకు రాసిన 'పిల్లా వెళ్లమస్తవ' పాటను నీచమైనదిగా సినిమాలలో వాడుకున్నారని ప్రజాకవి వంగపండు అభ్యంతరం వ్యక్తం చేసి ఆవేదన చెందాడు. 

కొరటాల శివ-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ కథ తనదేనని ఓ రచయిత, తాజాగా ఇదే కాంబినేషన్‌లో రూపొందుతున్న 'భరత్‌ అనే నేను', ఇక రానా-తేజల కాంబినేషన్‌లో వచ్చిన 'నేనే రాజు..నేనే మంత్రి' చిత్ర కథ తనదేనని తిమ్మిరెడ్డి అనే రచయిత.. ఇలా నేడు టాలీవుడ్‌లో అవి నిజమైనా, కాకపోయినా వివాదాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతుండటం బాధాకరం....!

In a shocking update a case against top producer Dil Raju was registered at Madhupur police station. A woman named Syamala Rani who lodged the complaint at Madhapur PS claimed that she was the original writer of Dil Raju's production venture Mr Perfect.

dil raju producer
case filed in police station
madhapur ps
syamala rani
mr perfect movie