నిహారిక, సాయిధరమ్ తేజ్ గురించి ఇది నిజమేనా?
Sai Dharam Tej and Niharikaమెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అబ్బాయిలు మాత్రమే హీరోస్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని ఏలుతున్నారు. కానీ గత ఏడాది మెగా ఫ్యామిలీ ఆడపిల్ల నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా 'ఒక మనసు' మూవీ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ అమ్మడు అప్పటికే గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంటరై బుల్లితెర మీద యాంకరింగ్ కూడా చేసింది. ఇక తనకున్న పట్టుదలతో ఆమె హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. 'ఒక మనసు' సినిమాలో నాగ సౌర్యతో రొమాన్స్ చేసింది. ఆ సినిమా పోజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిట్ కాలేకపోయింది.
అయితే అప్పటి నుండి నిహారిక ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చెయ్యకుండా కేవలం తమిళ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు నిహారిక పెళ్లి గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక త్వరలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని పెళ్ళి చేసుకోబోతోందట. ఇప్పటికే ఈ పెళ్లి విషయాలు మెగా ఫ్యామిలీ వారు చర్చినట్లు కూడా వార్తలొచ్చాయి. ఇక ఈ వార్తలు నమ్మడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ, నిహారిక బావ మరదళ్ళు కావడం ఒకటైతే మరొకటి ఇద్దరూ సినీ ఫీల్డ్ లోనే ఉండడం. అందుకే ఈ పెళ్లి వార్త దావానంలా వ్యాపించింది.
మరి నిహారిక, సాయి ధరమ్ పెళ్లి అనేది నిజంగా ఒక రూమరా? లేకపోతె నిజామా అనేది మెగా ఫ్యామిలీ స్పందిస్తే గాని తెలియదు.
Supreme Star Sai Dharam Tej and Mega brother Naga Babu’s daughter Niharika are in love. These rumors even suggested on Niha and Sai fell in love during Oka Manasu shooting though both knew each other from childhood and are more known as friendly before cupid has strike them at heart.







































