మీడియా ఇలా తయారు కావడానికి ఎవరు కారణం..?

ఒక్క వ్యక్తి లేదా కొందరు తప్పు చేసినంత మాత్రాన ఆ వ్యవస్థనే తిట్టకూడదు. అందులో కూడా ఆదర్శవాదులుంటారు. జీవితాలను ఫణంగా పెట్టిన వారు కూడా ఎందరో. కొందరు ముస్లింలు తప్పు చేసినంత మాత్రన అందరూ టెర్రరిస్ట్‌లు కాదు. వారిలో కూడా తస్లీమానస్రీన్, సల్మాన్‌రష్దీ, ఖాన్ అబ్దుల్‌గఫార్‌ఖాన్‌లు ఉన్నారు. ఇక నేడు మీడియాను చూసి చాలామంది చెడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పచ్చినిజం.. మీడియా దిగజారింది. దానికి ఇప్పుడు విలువ, గౌరవం లేవు. కేవలం పబ్లిసిటీ, ప్రమోషన్, భజన వంటి వాటికి దిగజారాయి. మీడియాను చూస్తే బ్లాక్‌మెయిలింగ్, డబ్బుల దండుకోవడానికి, మీడియేషన్స్, సెటిల్‌మెంట్లు చేసే స్థాయికి విలువలు పతనమయ్యాయి.
అందుకే అన్ని ఇజాలైన 'టెర్రరిజం, కమ్యూనిజం, మావోయిజం, లెనినిజం..' వీటన్నింటికంటే చివరకు 'రౌడీయిజం' కంటే నీతిమాలిన 'ఇజం'లేనిదిగా 'జర్నలిజం' మారింది. ఇక కొత్తగా 'పవవనిజం, జగనిజం' లు కూడా వచ్చేశాయి. కానీ కొందరు ధనవంతులు, కులనాయకులు, రాజకీయనాయకులు.. ఇలా కొందరి చేతిలో నేటి మీడియా చిక్కుకుపోయింది. దీన్ని ఎవ్వడూ కాపాడలేడు. నిజాయితీపరులైన జర్నలిస్ట్‌లపై కూడా దౌర్జన్యాలు, బలవంతం, భౌతికదాడులు తప్పడం లేదు. భజన చేసే వారికి, తమకు అనుకూలంగా రాసే వారికే యాజమాన్యాలు కూడా ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇచ్చి, మాటకారితనం లేని నిజాయితీపరులను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. దీంతో జర్నలిజం అంపశయ్యపై ఉంది.
ఒకప్పుడు నిజాలు రాసిన ఎన్‌కౌంటర్ దశరథరాం, కాగడా శర్మల నుంచి శ్రీశ్రీ వరకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఇలాంటి ఎందరినో మనసోకాల్డ్ నాయకులు హత్యలు కూడా చేశారు. తలాపాపం తిలా పడికెడు... సాక్షిని కొని, చదువుతున్నది ఏ కులం, ఏ పార్టీ వారు? ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వెనుక ఎవరు ఉన్నారు? వాటిని ఆదరించే పాఠకులు, వీక్షకులు ఎవరు? ఆయా మీడియాలనే ప్రజలు చదువుతూ, ప్రోత్సహిస్తూ ఉంటే అది తప్పు జర్నలిస్ట్‌లదా? యాజమాన్యాలదా? లేక పాఠకులుదా, వీక్షకులులదా...?







































