'బాహుబలి2'- 'దంగల్' రికార్డ్సే టార్గెట్..!

'బాహుబలి2' చిత్రం విడుదలకు ముందే ఇప్పటికే 500కోట్లకు పైగా ప్రీరిలీజ్ థియేటికల్ రైట్స్‌ను సాధించింది. ఇక ఈ చిత్రం ఇండియా సినీ హస్టరీలో ఎవ్వరూ సాధించలేకపోయిన 1000కోట్ల కలెక్షన్లు మార్కును అందుకోవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే మాత్రం రెండో పార్ట్ ద్వారా నిర్మాతలకు భారీగానే లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు అమీర్‌ఖాన్ నటించిన 'దంగల్' చిత్రం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 792కోట్లు సాధించింది.
దానిని 'బాహుబలి- ది కన్‌క్లూజన్' తిరగరాసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 'బాహుబలి' మొదటి పార్ట్‌కు పెద్దగా లాభాలు రాకపోవడానికి విదేశాలలో రిలీజ్ చేయడమే కారణమని భావిస్తున్నారు. చైనీస్‌తో పాటు పలు యూరప్ దేశాలలో ఈ చిత్రాన్ని భారీగా ఖర్చుపెట్టి డబ్ చేసి, మంచి మంచి థియేటర్లలో ప్రదర్శించారు. దీనివల్ల ఈ చిత్ర నిర్మాతలకు లాభాలు మిగలలేదని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. అయితేనేం అంతకంత ఈ పార్ట్ తో నిర్మాతలు సాధించబోతున్నారని తెలుగు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది.







































