అంగరంగ వైభవంగా జరిగిన ఆడియో లాంచ్..!

నాగార్జున - కె రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్ర ఆడియో నిన్నఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రం కూడా భక్తిరస చిత్రంగా ఉంటుందని తెలిసిన విషయమే. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో 'అన్నమయ్య, శ్రీరామదాసు షిర్డీ సాయి' చిత్రాలు మంచి ఫలితాన్నిచ్చాయి. ఇక ఇప్పుడు కూడా ఈ చిత్రం వేంకేటేశ్వర స్వామి పరమ భక్తుడు హాథిరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఆడియోతో పాటు ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేసారు.

వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ నిత్యం పూజిస్తూ విపరీతంగా ఆరాధించే భక్తునికి అనేకరకాల పరీక్షలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి... అచ్చం శ్రీరామదాసు చిత్రంలోలా...ఇక హాథిరామ్ బాబా గా నాగార్జున ఎప్పటిలాగే చక్కగా ఆకట్టుకుంటున్నాడు. ఇక అనుష్క కూడా కృష్ణమ్మ గా  ఫస్ట్ లుక్ తోనే అందరిని మెప్పించించి. ఇక దర్శకుడు రాఘవేంద్ర రావు తమ మార్క్ శైలిలో ఈ చిత్రాన్ని చెక్కాడు. కీరవాణి మరోసారి తన మ్యూజిక్ మాయాజాలాన్ని చూపించాడు. రావు రమేష్, ప్రగ్య జైస్వాల్, జగపతిబాబు, విమలారామన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అతి తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.   

nagarjuna
director raghavendra rao
om namo venkatesaya movie
audio launch
amala
jagapathi babu