నమస్తే తెలంగాణ తేలిపోయింది!!

ప్రతిరోజు కేసీఆర్ కు, ప్రభుత్వానికి అనుకూల వార్తలు రాసే 'నమస్తే తెలంగాణ' పత్రిక ఒక విషయంలో మాత్రం వెనుకబడింది. ప్రభుత్వ నిర్ణయాలని సేకరించి ఎక్స్ క్లూజివ్ గా ఇస్తామని చెప్పుకునే ఈ పత్రిక  శనివారం మాత్రం చేతులెత్తేసింది. 'ఈనాడు' క్రెడిట్ కొట్టేసింది. విషయం ఏమంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సినిమా అవార్డులపై స్పష్టత కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసింది. పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ శుక్రవారం నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో తెలంగాణ బ్రాండ్ తో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఎవరెవరి పేరున అవార్డులు ఇవ్వాలో కూడా సిఫారసు చేసింది. ఈ న్యూస్ 'ఈనాడు' మినహా ఇతర పత్రికలు ముఖ్యంగా ప్రభుత్వ అనుకూల పత్రిక 'నమస్తే తెలంగాణ' కవర్ చేయలేకపోయింది. ప్రధాన బ్యానర్ ఐటమ్ మిస్ చేసుకుంది. కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తే వార్తలకే ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం తీసుకునే డెవలప్ మెంట్ నిర్ణయాలను విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్స్ క్లూజివ్ వార్తలు సేకరించాలంటే అంత విజీ కాదని 'నమస్తే...' గ్రహించింది. 

namaste telangana
eenadu
cinema awards
kcr