ఆ దినపత్రిక - ప్రకటనల దోపిడి!!

దీపావళి పురస్కరించుకుని పలువురు నిర్మాతలు తమ కొత్త సినిమాల లుక్స్ , రిలీజ్ డేట్స్ ప్రకటించారు. నవంబర్ 4న చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. నిర్మాతలందరూ 'ఆంధ్రజ్యోతి'కి ప్రకటనలు ఇచ్చి మిగతా పేపర్లకు మాత్రం స్టిల్స్ ఇచ్చారు. అంటే 'జ్యోతి'కి ఒక్కో ప్రకటనకు 40 వేల నుండి 3 లక్షల వరకు గిట్టుబాటు అయిందన్నమాట. అదే మిగతా పేపర్లకు మాత్రం ప్రకటనలు ఇవ్వడానికి పిఆర్వోలకు, నిర్మాతలకు మనసొప్పలేదు. సర్కులేషన్ లో 'ఈనాడు', 'సాక్షి' అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాత చాలా దూరంలో 'ఆంధ్రజ్యోతి' ఉంది. అయినప్పటికీ 'జ్యోతి' అనేక ప్రకటనలు తన్నుకుపోయింది. పాఠకుల కంటే పంపిణీదారులే ఈ పత్రికను చూస్తారని, అందుకే 'జ్యోతి'కి యాడ్స్ ఇస్తారని అంటారు. 'ఆంధ్రజ్యోతి' దినపత్రికను ట్రేడ్ లో సినీ దిన పత్రికని కామెంట్ చేస్తుంటారు. దీపావళి రోజున 'ఆంధ్రజ్యోతి'కి ప్రకటన రూపేనా దాదాపు 7 లక్షల ఆదాయం వచ్చింది. ఇంత ఆదాయం పొందుతున్న ఈ పత్రిక సినిమా వార్తలను మాత్రం ప్రచురించడానికి ఆసక్తి చూపదు. వార్తల కంటే ప్రకటనలే ముఖ్యమని భావిస్తోంది. అంటే సినీ నిర్మాతలకు వార్తల పరంగా 'జ్యోతి' మెుండిచేయి చూపుతుందనే అసంతృప్తి నిర్మాతల్లో ఉంది. దీపావళి రోజున స్టార్ హీరోల ఫస్ట్ లుక్స్ విడుదలైనా సరే వాటిని ప్రచురించలేదు. పైగా అవసరం లేని క్యారెక్టర్ ఆర్టిస్టు మురళిశర్మ ఇంటర్య్వూ ఫుల్ పేజీ వేసింది. ఇలాంటి ఇంటర్య్వూలు సినిమా ప్రమోషన్ కోసం వేసిన దాఖలాలు లేవు.

'ఆంధ్రజ్యోతి'  సినిమాల ద్వారా ఏడాదికి దాదాపు 20 కోట్లకు పైగా ఆదాయం పొందుతోందని అంటారు. ఉద్యోగుల జీతాలు ఈ ఆదాయం ద్వారానే చెల్లిస్తోంది. ఉచితంగా ఇచ్చే ప్రచారాన్ని మాత్రం కావాలని తొక్కిపెడుతోంది. ఇక 'ఆంధ్రజ్యోతి'కి ప్రకటన ఇవ్వాలంటే వారి అనుబంధ ఛానల్ 'ఏబిఎన్' కు కూడా ఇవ్వాలట. ఇది నిర్భందంగా వసులు చేస్తున్నారని నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రేటింగ్ పరంగా 'ఏబిఎన్ ఛానల్' చాలా వెనుకబడి ఉంది. దాంతో యాడ్స్ ఇవ్వడానికి నిర్మాతలు ఇష్టపడరు. అందువల్ల 'ఆంధ్రజ్యోతి' దినపత్రికకు వచ్చే ప్రకటనల ద్వారానే ఛానల్ కు  ఆదాయం పొందాలనే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతోంది. దీనివల్ల 25 వేల రూపాయలున్న ప్రకటన ధరను 40 వేలకు పెంచేశారు. మొదటిపేజీలో కుంబకోణాల గురించి కథనాలు ప్రచురించే 'జ్యోతి' తను చేస్తున్న నిర్బంద వసూలు గురించి మాత్రం మాట్లడదు. ప్రటనలు పేపర్ కే ఇవ్వాలా, ఛానల్ కు ఇవ్వాలా అనేది నిర్మాత ఇష్టం. కానీ 'జ్యోతి' మాత్రం ఛానల్ కు కచ్చితంగా ఇవ్వాలనే నిబందన పెట్టి బలవంతంగా వసూలు చేస్తుందని చాలా మంది నిర్మాతలు వాపోతున్నారు. 

కొద్ది నెలల క్రితంప్రకటనలు ఇవ్వని నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడలేదు. యాడ్స్ ఇవ్వకుంటే నెగిటివ్ రివ్యూలు రాస్తామని బెదిరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

 'ఆంధ్రజ్యోతి' తీరుపై పలు సందర్భాల్లో నిర్మాతల మండలి చర్చించినట్టు సమాచారం. అయితే నిర్మాతల్లో చాలామంది, పత్రిక యజమాని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల చర్చల్లో పురోగతి కనిపించలేదు. కానీ కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు మాత్రం ప్రకటనల దోపీడికి చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. 

andhra jyothi
eenadu
publicity ads
sakshi