పవన్ త్రివిక్రమ్ సినిమాకి సంగీతం కన్ఫామ్..!

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రెడీ కాబోతుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా వై దిస్ కొలవెరి కోలవెరి డీ.. ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. కాగా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది వంటి సినిమాలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇవి రెండూ భారీ విజయాలతో పాటుగా భారీ వసూళ్లను కూడా సాధించింది.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అఆ సినిమాకే అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నా, అనుకోని కారణాల వల్ల అనిరుధ్ ఆ సినిమాకి సంగీతాన్ని అందించలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం పక్కా తెలుగు ఎంట్రీ ఉంటుందని అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అనిరుధ్ స్వయంగా మాట్లాడుతూ.. త్రివిక్రమ్ చెప్పిన కథ చాలా బాగుంది. అది రెగ్యులర్ తెలుగు సినిమాలా కాకుండా ఓ స్టైల్ గా ఉంటుంది. అందుకనే ఆ సినిమాలో సంగీతాన్ని తాను చేయడానికి ఒప్పుకొన్నాను అన్నాడు. మొత్తానికి తాజాగా రానున్న త్రివిక్రమ్ చిత్రం వీటన్నింటి కంటే భిన్నంగా, సరికొత్త రీతిలో ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సారి త్రివిక్రమ్ ప్రేక్షకులకు కొత్త రుచిని చూపించనున్నాడన్న మాట.







































