శరవేగంలో మణిశర్మ చిత్రం..!

ఈ మధ్య ఓకె బంగారం సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన గొప్ప దర్శకుడు మణిరత్నం. కాగా ఈయన మరోసారి తనదైన శైలిలో దర్శకత్వపు రుచులను చూపించేందుకు తయారవుతున్నాడు. ఇప్పుడు తాజాగా తనకు నచ్చే తను మెప్పించగలిగే శైలిలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అభిమానులను అలరించేందుకు కాట్రు వెళదిలై సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కార్తీ, అదితిరావ్ హైదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా కార్తీ తన తాజా మూవీ కాష్మోరా పనుల విషయంలో చాలా బిజీగా ఉండటంతో మణిరత్నం ఈ సినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ దొరికింది. ఈ మధ్యనే కాష్మోరా ఆడియో విడుదల కార్యక్రమాలు పూర్తి కావటం, సినిమాకు మరి కాస్త సమయం ఉండటంతో ఈ సమయంలోనే మరో షెడ్యూల్ ను పూర్తి చేయాలని మణిరత్నం నిర్ణయించుకున్నాడు. ఈ షెడ్యూల్ ను హైదరబాద్ లోని పలు కీలక ప్రదేశాల్లో షూట్ చేసేలా ప్లాన్ చేశారు. కాగా పది రోజుల పాటు జరగనున్నఈ హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత లడఖ్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని సాంగ్స్ తో పాటు యాక్షన్ సీన్లను కూడా లడఖ్ లో షూట్ చేసేందుకు తయారవుతున్నారు మణిశర్మ. కాగా మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ వరకు పూర్తి చేసి, జనవరిలో అంటే సంక్రంతికి గానీ పిబ్రవరిలో కానీ విడుదల చేసేందుకు సమాయాత్తమౌతుంది చిత్రబృందం.







































