ప్ర‌భాస్ గుడ్ న్యూస్ అదేనా..!

ఈ నెల 5న ప్ర‌భాస్ ఫ్యాన్సంద‌రికీ ఓ గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నామ‌ని నిన్న ద‌ర్శ‌కుడు  రాజ‌మౌళి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇంత‌కీ ఆ న్యూస్ దేనికి సంబంధించింది అని మీడియా అడిగినా రాజ‌మౌళి సమాధానం చెప్ప‌లేదు.  ఆ విష‌యం మేం కూడా ఊహించ‌నిద‌నీ,  తెలుగు ఫ్యాన్స్ కే కాదు, సౌత్ ఇండియా సినిమా అభిమానుంతా  కూడా  సంతోషించేలా ఆ న్యూస్ ఉంటుంద‌ని, అదేంట‌న్న‌ది ఐదో తేదీనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు రాజ‌మౌళి. అప్ప‌ట్నుంచి ప్ర‌భాస్ ఫ్యాన్స్‌, మీడియా, ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు... ఇంత‌కీ ఆ న్యూస్ దేని గురించి అని శోధించ‌డం మొద‌లుపెట్టాయి. రాజ‌మౌళి చెప్పిన‌దాన్నిబ‌ట్టి ప్ర‌భాస్‌కి ఏదైనా ఓ ఇంట్ర‌స్టింగ్ ఆఫ‌ర్ వ‌చ్చుంటుంద‌నీ, అది హాలీవుడ్ నుంచో... బాలీవుడ్ నుంచే వ‌చ్చిన ఆఫ‌ర్ అయ్యుంటుంద‌ని ప‌రిశ్ర‌మ‌, మీడియా వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి. నిజానికి బాహుబ‌లి ది బిగినింగ్ విడుద‌ల కాగానే బాలీవుడ్ చూపు ప్ర‌భాస్‌పై ప‌డింది. అయితే బాహుబ‌లి 2 కూడా ఉంటుందని తెలియ‌డంతో ప్ర‌భాస్ ఎలాగో ఆ  సినిమా వ‌ద‌లి బ‌య‌టికి రాలేడు  కాబ‌ట్టి ఆయ‌న్ని సంప్ర‌దించే ప్ర‌య‌త్నం ఎవ్వ‌రూ చేయ‌లేదు. ఇప్పుడు బాహుబ‌లి 2 చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకొంది కాబ‌ట్టి  ప్ర‌భాస్ కోసం రాజ‌మౌళిని సంప్ర‌దించుండొచ్చ‌ని, ఆ డీల్ కుద‌ర‌డంతోనే రాజ‌మౌళి ఈ నెల 5న ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండొచ్చ‌ని, ప్ర‌భాస్ అభిమానుల్ని ఖుషీ చేసేందుకే రాజ‌మౌళి ప్ర‌త్యేకంగా  విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేసి ఆ విష‌యాన్ని వెల్ల‌డించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. 
bahubali 2 look launch
prabhas for bollywood
prabhas
rana
bahubali 23
raja mouli