ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మహేష్ చేస్తున్న క్యారెక్టర్ అదేనంట..!

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఆసినిమాపై రెండుచోట్లా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మహేష్‌బాబులాంటి కథానాయకుడికి, మురుగదాస్‌లాంటి దర్శకుడు తోడు కావడమే అందుకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా విషయంలో ఆ ఇద్దరూ చాలా సీక్రెట్ మెంటైన్ చేస్తున్నారు. కథ, పాత్రల గురించి అసలేమీ చెప్పడం లేదు. మొదట్లో ఈ కథ న్యాయవ్యవస్థ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం సాగింది. కానీ మహేష్ మాత్రం అది కాదని మీడియా ముందు తోసిపుచ్చాడు. అయితే కథేంటో తెలియదు కానీ... మహేష్‌బాబు చేస్తున్న క్యారెక్టర్ ఏంటన్నది మాత్రం లీకైంది. అది కూడా తమిళ సినీ వర్గాల నుంచి బయటికొచ్చిన సమాచారం. వారం రోజులుగా మహేష్‌పై చెన్నైలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళ తంబీలకి తెలిసిందేంటంటే మహేష్ ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడని! ఆ పాత్ర చాలా స్టైలిష్‌గా, మహేష్‌ని ఓ కొత్త కోణంలో చూపించబోతోందని సమాచారం. పనిలో పనిగా కథ గురించి కూడా చూచాయగా తెలిస్తే బాగుణ్ణు అని ఎక్సైట్‌మెంట్‌తో ఉన్న అభిమానులు మాట్లాడుకొంటున్నారు.
maheshbabu
murugadas
n v prasad
inteligence officer maheshbabu







































