'ధృవ'కి ఆ జాగ్రత్తలు తీసుకోవడం లేదా?

ఓ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు నిర్మాతలు, హీరోలు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. అఫీషియల్‌గా ఆ చిత్రాలను అందుబాటులో లేకుండా చేస్తారు. అదే ఒరిజినల్‌ కాపీ ఉంటే ఆ చిత్రం మాతృకను వెంటనే ఎక్కువ మంది చూసేస్తారు. దాంతో ఈ రీమేక్‌ను ఒరిజినల్‌ చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఈ రీమేక్‌ మాతృకలో ఉన్నంత ఎఫెక్టివ్‌గా తీయకపోతే అసలుకే మోసం వస్తుంది. కానీ ఈ జాగ్రత్తలు ఏమీ 'ధృవ' చిత్రం విషయంలో నిర్మాత అల్లుఅరవింద్‌ తీసుకోకపోవడం చరణ్‌ అభిమానులకు మింగుడుపడటం లేదు.ఇప్పటికే చరణ్‌ రీమేక్‌ చేస్తున్న 'తని ఒరువన్‌' ఒరిజినల్‌ వెర్షన్‌ను చాలామంది చూసేసారు. రేపు 'ధృవ' విడుదలైన తర్వాత ఆ ఎఫెక్ట్‌ ఈ రీమేక్‌పై పడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒరిజినల్‌ను మించిన రీతిలో ఉంటేనే అభిమానులు, సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారు. అది ఏమాత్రం ఒరిజినల్‌ వెర్షన్‌ కంటే బాగుండకపోతే మాత్రం బ్యాడ్‌ టాక్‌ వెంటనే స్ప్రెడ్‌ అయిపోవడం ఖాయమని, ఇంత అనుభవం ఉన్న నిర్మాత అల్లుఅరవింద్‌ రీమేక్‌ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం చరణ్‌ ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. 

dhruva
ram charan
allu aravind
thani oruvan
dhruva movie