విక్రమ్‌కు అంత సీన్‌నుందా....?

'అపరిచితుడు' తర్వాత చియాన్‌ విక్రమ్‌కు ఇప్పటివరకు ఓ యావరేజ్‌ మూవీ కూడా లేదు. తమిళంలో కూడా ఆయనది అదే పరిస్దితి. కమల్‌హాసన్‌ తర్వాత విలక్షణ పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలు చేయడంలో విక్రమ్‌కి ఓ ప్రత్యేకస్టైల్‌ ఉంది. ఆయనకంటూ తెలుగులో కూడా కొందరు అభిమానులు ఉన్నారు అయితే ఆయన ప్రస్తుతం 'ఇరుముగన్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా 'ఇంకొక్కడు'గా అనువాదం అవుతోంది. ఈ చిత్రం లుక్స్‌, ట్రైలర్స్‌ అందరినీ బాగా అలరిస్తున్నాయి. వరస ఫ్లాప్‌లలో ఉన్న విక్రమ్‌ 'ఇరుముగన్‌' సినిమాకు తమిళంలో కూడా బిజినెస్‌పరంగా పెద్ద హైప్‌ రాలేదు. వరుస ఫ్లాప్‌లలో ఉన్న విక్రమ్‌కు ఈ చిత్రం మంచి హిట్‌ను అందిస్తుందనే నమ్మకం ఉన్నా బయ్యర్లు మాత్రం ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్‌కు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మరి తమిళంలో పరిస్ధితే ఇలా ఉంటే తెలుగులో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అయితే ఈచిత్రం తెలుగు అనువాద హక్కులను ఎన్‌కెఆర్‌ ఫిలిమ్స్‌ సంస్ద భారీ ఫ్యాన్సీరేటుకు.. అంటే దాదాపు రూ.11.5కోట్లకు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ వరస ప్లాప్ లతో వున్న విక్రమ్ కి  తెలుగు లో అంత సీన్‌లేదని.. ఇదంతా సినిమా హైప్‌ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే అని టాలీవుడ్‌ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. 

vikram chiyaan
iru mugan movie
telugu rights
inkokkadu movie
fancy rate