మారుతిపై ఆరోపణలు నిజమేనా?

ఇటీవలికాలంలో కొన్ని చిత్రాలల్లో నటించే మహిళా ఆర్టిస్ట్‌లు తమను డైరెక్టర్ లేదా నిర్మాత వేధిస్తున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం సాధారణం అయిపోయింది. వీటిల్లో కొన్ని పోలీస్ కంప్లైట్స్ వరకు వెళుతున్నాయి. కానీ పెద్ద చిత్రాల అంటే స్టార్‌హీరోలు, హీరోయిన్లు నటిస్తున్న చిత్రాల విషయంలో ఇలాంటివి చాలా అరుదు. కానీ 'బాబు బంగారం' సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ నయనతార పట్ల దర్శకుడు మారుతి ఇలా వేధింపులు, అసభ్య ప్రవర్తనలతో విసిగిపోయిన నయనతార ఈ చిత్రం షూటింగ్ సమయంలో చాలాసార్లు ఆమె సెట్స్ నుంచి వాకౌట్ చేసిందని కూడా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం డేట్స్ విషయంలో నయనతార యూనిట్‌ను ఇబ్బందులు పెట్టిందనే వార్తలు వినిపించాయి. కానీ ఆమె అంతకు ముందు వెంకటేష్-నయనతారలతో మారుతి దర్శకత్వంలో ప్రారంభమైన 'రాధ' చిత్రానికి డేట్స్ ఇచ్చింది. కానీ ఈచిత్రం ఆగిపోయింది. నయన ఇంతకు ముందు వెంకటేష్‌తో 'తులసి, లక్ష్మీ' చిత్రాల్లో నటించింది. ఆమెకు వెంకటేష్‌తో మంచి స్నేహం కూడా ఉంది. ఆ గౌరవంతోనే నయన తమిళంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ 'రాధ' ఆగిపోయిందన్న కారణంగానే వెంకటేష్ కోసం ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేసింది. కాగా నయన పట్ల దర్శకుడు మారుతి అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో నయనతార ఈ విషయంలో అన్ని మౌనంగా భరించి, షూటింగ్‌కు సహకరించిందంటే అది వెంకీపై ఉన్న అభిమానమే. ఈ విషయం గురించి వెంకీ కలుగజేసుకోకపోవడంతో మారుతి ప్రవర్తన అలా పీక్స్‌కి వెళ్లిందని అంటున్నారు. మరి ఈ విషయంలో అటు నయనతార గానీ, మారుతి గానీ స్పందిస్తే గానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. అప్పటి వరకు వీటిని ఆరోపణలు గానే చెప్పుకోవాలి.







































