హీరో పేరు చెప్పి గుణశేఖర్‌కి హ్యాండిచ్చాడు!

గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రం విడుదలైన తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో 'ప్రతాపరుద్రుడు' చిత్రాన్ని తానే నిర్మిస్తానని దిల్‌రాజు మాటిచ్చాడు. దిల్‌రాజు వంటి నిర్మాత మాట ఇవ్వడంతో ఇక గుణశేఖర్ ఎంతో నమ్మకంతో 'ప్రతాపరుద్రుడు'కు సంబంధించి అనేకమంది చారిత్రక పరిశోధకులతో, ప్రొఫెసర్లతో రీసెర్చ్ చేసి స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. అయితే స్క్రిప్ట్‌ను పూర్తి చేసిన తర్వాత గుణశేఖర్ స్క్రిప్ట్‌తో సహా దిల్‌రాజును కలిస్తే షాకింగ్ సమాధానం వచ్చిందట. స్క్రిప్ట్ పూర్తి చేయడం కాదు.. ఎవరైనా స్టార్ హీరో డేట్స్ కూడా తెస్తే గానీ తన చిత్రాన్ని నిర్మించే పరిస్థితి లేదని ట్విస్ట్ ఇచ్చాడట. దీంతో బిత్తరపోవడం గుణశేఖర్ వంతైంది. దీంతో ఇక లాభం లేదని భావించిన గుణశేఖర్.. దామోదర ప్రసాద్ నిర్మాతగా కొత్త వాళ్లతో ఓ లోబడ్జెట్ చిత్రం చేయాలని ఫిక్సయాడు. 'సొగసు చూడతరమా' టైప్‌లో ఈ చిత్రాన్ని రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందించడానికి ఆయన సిద్దమవుతున్నాడు. మొత్తానికి దిల్‌రాజు దెబ్బకు గుణశేఖర్ 'ప్రతాపరుద్రుడు'ను పక్కన పెట్టేసినట్లే.







































