విలన్ గా స్టైలిష్ స్టార్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేయడంతో తన తదుపరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలని భావిస్తున్నాడు బన్నీ. దీనికోసం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తో సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. లింగు స్వామి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమా చేయాలని భావిస్తున్నాడు బన్నీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ కనిపించబోతున్నాడన్నది తాజా సమాచారం. అయితే అందులో ఒకటి హీరో పాత్ర అయితే మరొకటి విలన్ పాత్ర కావడం విశేషం. ఇదివరకు బన్నీను 'ఆర్య 2' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూశాం. కాని పూర్తి స్థాయి విలన్ పాత్రలో మొదటిసారిగా చూడబోతున్నాం. ఇప్పటివరకు లింగుస్వామి ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమనిపిస్తోంది. మరి విలన్ గా బన్నీ అభిమానులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి..!

allu arjun
sarainodu
linguswamy
villain role