చిరుకి, వినాయక్ కండీషన్స్!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ జూన్ మొదటి వారంలో జరగనుందని అభిమానులంతా భావించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కాస్త వాయిదా పడేట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం చిరు తన లుక్ ను కంప్లీట్ గా మార్చుకున్నాడు. తన లుక్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఆయన ఎంతగా కష్టపడ్డారో.. అర్ధమవుతుంది. అయితే వినాయక్ మాత్రం చిరంజీవిని మరో 5 కేజీల బరువు తగ్గితే బావుంటుందని చెప్పాడట. చిరు పూర్తిగా 'ఠాగూర్' సినిమాలో కనిపించిన విధంగా ఉండాలనేది వినాయక్ ఆలోచన. దీనికోసం చిరు ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. దీన్ని బట్టి షూటింగ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం చిరంజీవి లుక్ కోసం మాత్రమే కాదు.. మొన్నటివరకు హీరోయిన్ గా అనుష్క నటిస్తుందనుకుంటే ఆమె తెలివిగా తప్పుకుంది. సో.. చిరుకి మరో హీరోయిన్ ను కూడా వెతకాలి. వీటన్నింటికి ఖచ్చితంగా సమయం పడుతుంది. అందుకే చిరు సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుందనే వార్తలు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. 

chiranjeevi
150th film
vinayak
anushka