అక్కినేని హీరోతో కొరటాల.?

నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ వినాయక్ డైరెక్షన్ లో 'అఖిల్' సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కాస్త బెడిసి కొట్టింది. తన మొదటి సినిమాకే ఫ్లాప్ టాక్ రావడం అఖిల్ తట్టుకోలేకపోయాడు. దీంతో తను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా హిట్ అవ్వాలని ప్లాన్డ్ గా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నేపధ్యంలో అఖిల్ రెండో సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయబోతున్నాడని స్వయంగా నాగార్జున 'ఊపిరి' సినిమా టైంలో చెప్పారు. కాని ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ సెట్ కావట్లేదని తెలుస్తోంది. అలానే 'కృష్ణగాడి వీరప్రేమ గాధ' దర్శకుడు హను రాఘవపుడి పేరు కూడా వినిపించింది. ఇప్పుడేమో టాప్ డైరెక్టర్ కొరటాల శివ పేరు వినిపిస్తోంది. కొరటాల అఖిల్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. 'జనతా గ్యారేజ్' సినిమా పూర్తయిన తరువాత కొరటాల, అఖిల్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు టాక్. రీసెంట్ గా అఖిల్ మలయాళం సూపర్ హిట్ 'కమ్మట్టి పాదం' సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మరి కొరటాల రీమేక్ సినిమాను డైరెక్ట్ చేస్తాడా..? లేక తను సొంతంగా కథను సిద్ధంగా చేసుకుంటాడా..? అనే విషయాలు తెలియాల్సివుంది..!

akhil akkineni
akhil movie
koratala siva
janatha garage